సికింద్రాబాద్ పార్లమెంట్ లో పద్మారావు గౌడ్ ను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలి….తలసాని.

సికింద్రాబాద్ పార్లమెంట్ బీ ఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీగుల్ల పద్మారావు గౌడ్ ను అత్యధిక మెజార్టీ తో గెలిపించుకోవాలని మాజీ మంత్రి.సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు నిచ్చారు.శనివారం మారేడ్ పల్లి లో నిర్వహించిన సనత్ నగర్ బీ ఆర్ ఎస్ ఆత్మీయ సమావేశం లో తలసాని కార్యకర్తలకు.నాయకులకు పిలుపు నిచ్చారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతు గా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సనత్ నగర్ నియోజకవర్గ సన్నహాక సమావేశం జరిగింది.
ముఖ్య అతిధి గా హాజరైన సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్.మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలు హైదరాబాద్ నగరం నుంచి
బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరు గెలిచారనీ అన్నారు అదే ఊపుతో సికింద్రాబాద్ పార్లమెంట్ కూడా మనం గెలవాలి.మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ కేవలం బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే నియోజవర్గాలకే నిధులు కాకుండా అన్ని పార్టీ ల ఎమ్మెల్యేలు నియోజవర్గాలకు అభివృద్ధి లో భాగంగా నిధులు కేటాయించారనీ గుర్తు చేశారు. అభివృద్ధికి ఆయన ఎంతో ప్రాదాన్యాత ఇచ్చారనీ అన్నారు .
ఇప్పుడు కొందరు ఎమ్మేల్యేలు అధికార పార్టీ లో చేరేందుకు తహ తహ లాడు తుండటం చూస్తుంటే రాజకీయాలు ఎలా దిగజారుతున్న విషయం స్పష్టమవుతుందని ఆయన అవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరంలో బలమైన శక్తిగా బి ఆర్ ఎస్ ఉందన్నారు.సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు బి ఆర్ ఎస్ గెలిస్తే కేంద్ర క్యాబినెట్ మంత్రిని ఓడించిన చరిత్ర మనకే దక్కుతుందని కార్యకర్తలకు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ చెప్పిన స్కీమ్ లను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం.
ప్రభుత్వం లో ఉన్నప్పుడు కన్నా ప్రతిపక్షంలో ఇంకా బాగా పని చేస్తాం.
కార్యకర్తలకు అందరికి అవకాశలు దొరుకుతాయి.
తాము కూడా సామాన్య కార్యకర్తలమే అని ఆయన పేర్కొన్నారు.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కరెంట్, మంచినీటి ఇబ్బందులు చాలా ఉన్నాయి .ఆరు గ్యారింటీలును ప్రభుత్వం అమలు చేయలేదు.
ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం పైన చాలా కోపంగా ఉన్నారనీ అన్నారు.కేసీఆర్ జిల్లాలు పర్యటనకు వెళ్ళినప్పుడు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎంత కోపంగా ఉన్నారన్న విషయం అర్థమైందని అన్నారు. పద్మారావు గెలుపు కోసం మనం కంకణం కట్టుకుని పని చేయాలన్నారు. గతంలో కేసీఆర్ తీసుకోచ్చిన పధకాలు ప్రజలకు గుర్తు చేయాలినీ,
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వైపల్యాలను ప్రజలోకి తీసుకొని వెళ్ళాలనీ,సనత్ నగర్ చరిత్రలో ఎన్నడు జరగనటువంటి అభివృధి జరిగింది.మనందరం సైనికులుగా పని చేసి పద్మారావు గౌడ్ గెలుపు కోసం పని చేయాలి. రకాలరకలాగా ప్రచారాలు జరుగుతాయి వాటిని పట్టించుకోవద్దు, ప్రభుత్వాలు మారినప్పుడు ఇలాంటివి సహజమని ఆయన అన్నారు. ఈ సమావేశం లో సనత్ నగర్ నియజకవర్గంలోనీ బీ ఆర్ ఎస్ కార్పొరేటర్లు.l, మాజీకార్పొరేటర్లు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గ అన్ని డివిజన్ ల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు…

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *