బిజేపి ఆవిర్భావ దినోత్సవం నిర్వహణ

భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం ఆవరణలో పార్టీ ఒంగోలు నియోజక వర్గ అధ్యక్షుడు వైసీ యోగయ్య యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ ఆవిర్భావ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. రెండు సీట్ల నుండి నేడు దశాబ్దకాలంలో భారత దేశంను పాలిస్తూ దేశంలో అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోతున్న విషయాలను పార్టీ బాధ్యులు వివరించారు. రాష్ట్రంలో బిజేపి ఒంటరిగా పోటీ చెయ్యాలన్న ఆకాంక్ష కార్యకర్తలకు బలంగా ఉన్నా పార్టీ ఆదేశాల మేరకు కూటమికి సహకరించాలని కోరారు. రాబోవు 2029లో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు. పార్టీ పార్లమెంటు కన్వినర్ సెగ్గం శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి డి శివాజీ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు అజయ్, ఉపాధ్యక్షురాలు జజ్జర క్రిష్ణ వేణి, అమరసింహా, అధికార ప్రతినిథి బొద్దిలూరి ఆంజనేయులు, అసెంబ్లీ కో కన్వినర్ ఐ సీతారామయ్య, ఎసీస, మహిళ మోర్చ అధ్యక్షులు పెరిక లక్ష్మణ్, తీగల సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి, దేశ నాయకుల చిత్ర పటాలను నివాళులు అర్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *