మహిళలు ఆర్దికంగా నిలదొక్కుకునేందుకు ఏ బీ వీ ఫౌండేషన్ అండగా వుంటుంది -ముఖ్య అతిధి కావ్యా కిషన్ రెడ్డి.

మహిళలు ఆర్దికంగా నిలదొక్కుకునేందుకు ఏ బీ వీ ఫౌండేషన్ అండగా నిలుస్తుందని ముఖ్య అతిధి కావ్యా కిషన్ రెడ్డి అన్నారు.రామ్ గోపాల్ పేట్ డివిజన్ పరిధిలో ఏ బీ వీ ఫౌండేషన్ నిర్వహించిన కుట్టు,మగ్గం,బ్యూ టిషియన్ ,క్యాండిల్ తదితర మహిళల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం రెండవ బ్యాచ్ కు కావ్యా కిషన్ రెడ్డి చేతుల మీదుగా 2 వ బ్యాచ్ 45 మంది సభ్యులకు ధృవీకరణ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కావ్యా కిషన్ రెడ్డీ మాట్లాడుతూ మహిళలు స్వయం కృషితో ఎదగాలంటే చేతి వృత్తులలో శిక్షణ పొందటం ఎంతో అవసరం అన్నారు. ఈ కార్యక్రమం లో రామ్ గోపాల్ పెట్ డివిజన్ కార్పొరేటర్ చీరె సుచిత్ర శ్రీకాంత్,మహిళా మోర్చాో నాయకులు అనురాధా,కోమల్, రమా,ఇంఛార్జి నీరజ బోధకులు కవిత , లక్ష్మీ,సుజాత తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *