మాజీ ఎన్ డి ఎమ్ ఏ ఉపాధ్యక్షులు మర్రి శశిధర్ రెడ్డి నీ ప్రముఖ వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వి. ఐ.టి) చాన్సిలార్ విశ్వనాథన్
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి నీ మర్యాద పూర్వ కం గా కల్సుకున్నారు. విశ్వనాథన్ తమిళనాడు
మాజీ గవర్నర్ ,దివంగత డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి కి అత్యంత సన్నిహితులు. వీఐటీలోని ఆడిటోరియంకు ఆయన జ్ఞాపకార్థం డాక్టర్ చెన్నారెడ్డి ఆడిటోరియం అని పేరు కూడా పెట్టారు.
శశిధర్ రెడ్డికి ఇటీవలే కంటి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో పాటు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో శ్రీ విశ్వనాథన్ తార్నాక లోని మర్రి నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు.త్వరగా కొలు కావాలని అన్నారు. ఇద్దరూ పాత అనుభవాలను నెమరు వేసుకున్నారు.
