గుంటి గంగా భవాని అమ్మవారి దేవస్థాన వేలం పాటలు నిర్వహణ

జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని అమ్మవారు దేవస్థానం వద్ద పూజా సామగ్రి, ఇతర తినుబండారాలు, కూల్ డ్రింక్స్ అమ్ముకునేందుకు హక్కు వేలం పాటలను సోమవారం నిర్వహించారు. ఆలయ ఈఓ పి కార్తిక్ ఆధ్వర్యంలో వేలం పాటలు నిర్వహించారు. సంవత్సరం పాటు కొబ్బరి కాయలు అమ్ముకునేందుకు రూ. 4,83,000, తినుబండారాలు, కూల్ డ్రింక్స్ కు రూ.1,50,000, కొబ్బరి చిప్పులు ప్రొగు చేసుకునేందుకు రూ.1,54,000లకు వేలం పాటలను దక్కించుకున్నారు. 2025 మార్చి 31 వరకు పాట దారులకు హక్కు ఉంటుందన ఈఓ కార్తిక తెలిపారు. గత సంవత్సరం ఆయా పాటల వలన రూ.6,40,000లు ఆదాయం రాగా, ప్రస్తుత సంవత్సరం 7,87,000లు వచ్చినట్లయినది. అంటే రూ.1,47,000 అదనంగా ఆదాయం వచ్చినట్లయినది. అదే విధంగా హుండీ ఆదాయం కూడ లెక్కించారు. నవంబర్ 3 నుండి ఎప్రియల్ 8 వరకు ఐదు నెలల ఐదు రోజులకు హుండీ ఆదాయం రూ.3,90,363లు వచ్చినదని ఈఓ తెలిపారు. అయితే తిరునాళ్లకు ఎన్నికల కోడ్ కారణంగా ప్రభలు లేక పోవటంతో తిరునాళ్ల పాటలు పాడుకోవటానికి ఎవరూ ముందుకు రాలేదని ఈఓ తెలిపారు. దేవస్థాన కమిటీ చైర్మన్ కొసనా గురు బ్రహ్మం, దేవదాయ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *