టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 30 కుటంబాలు సుమారు 200 మంది ఓటర్లు సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. 10,11,12 వార్డులకు చెందిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు సోమవారం పాశం సురేష్, షేక్ ఖాశీల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన అల్లాభక్షు, షేక్ హుస్సేన్, ఖాశీంలు మాట్లాడుతూ బూచేపల్లి శివప్రసాదొడ్డి ఇక్కడే నివాసం కట్టుకుని ఉంటున్నారని పేర్కొన్నారు. 20 ఏళ్లుగా దర్శి నియోజకవర్గంలో సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడా అవినీతి మచ్చలేదన్నారు. అందుకే వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు తెలియజేశారు.
పార్టీలో చేరిన వారిలో అల్లాభక్షు, షేక్ హుస్సేన్, షేక్ ఖాసీం, షేక్ బాషా, షేక్ అమీర్ బాషా, గౌస్ పీరా, వెంకట్రావు, బోగిశెట్టి కిరణ్, నీలిశెట్టి ఏడుకొండలు, దేవసూత్ శ్రీనునాయక్, రూపుల్ నాయక్, నర్నటి అజయ్, షేక్ బాజీ, ఖాశీ, అబ్దుల్లా, సాయి, ప్రసాద్ చనిలిశెటి రామోహన్ ఉన్నారు.




