అడుగడుగునా అపూర్వ ఆదరణ -ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇస్త్రీ చేసిన బాలినేని శచీదేవి -ఒంగోలు సుజాతనగర్ లో బాలినేని శచీదేవి, శ్రీకావ్య ఎన్నికల ప్రచారానికి బ్రహ్మరథం

ఒంగోల పట్టణంలోని సుజాతనగర్ లో బాలినేని శచీదేవి, శ్రీకావ్య ఎన్నికల ప్రచారానికి అడుగడుగునా అపూర్వ ఆదరణ లభించింది. సోమవారం రాత్రి ఒం గోలు 37వ డివిజన్ లో మహిళలతో మమేకం-స్త్రీ శక్తితో శచీదేవి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచీదేవి, కోడలు శ్రీకావ్య హాజరై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు హారతులిచ్చి గుమ్మడి కాయతో దిష్టి తీసి స్వాగతం పలికారు. డివిజన్లోని సమస్యల గురించి శచీదేవి, శ్రీకావ్య అడిగి తెలుసుకు న్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా.. లే దా..? అంటూ ప్రశ్నించారు. వలంటీర్లు స్వయంగా ఇంటికి వచ్చి మరీ పథకాలు అందేలా చేస్తున్నారని ప్రజలు తెలిపారు. తాము ఏళ్ల తరబడి అద్దె ఇళ్లలో ఉంటున్నామని, తమకు నేడు ఇంటి పట్టా రావడం ఆనందంగా ఉందని పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. సుజాతనగర్ 8వ లైను నుంచి గత ప్రభుత్వంలో చుక్కల భూములుగా చూపించారని, వాసన్న పట్టుబట్టి చుక్కల భూముల నుంచి విముక్తి
కల్పించి తమకు సంపూర్ణ హక్కులు లభించేలా చేయడం ఆనందంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. మళ్లీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వస్తుందని, 37వ డివిజన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని శచీదేవి, శ్రీకావ్య హామీ ఇచ్చారు. అందరూ వైఎస్సార్ సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. మరో వైపు డిజిటల్ స్క్రీన్ పై వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ నిర్వహించిన ప్రదర్శన ప్రజలను ఆలోచింపజేసింది. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ 37వ డివిజన్ అధ్య క్షుడు గునుపాటి వెంకారెడ్డి, ఇన్చార్జి గోలి తిరుపతి రావు, కార్పొరేటర్ గోలి లక్ష్మీకోటేశ్వరమ్మ, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా, నగర అధ్యక్షులు తమ్మినేని మాధవి, సువర్ణ, చక్రి, వీరారెడ్డి, అనీల్, సతీష్, ఆర్. వెంకట్రావు, వెంకట్రెడ్డి, సతీష్, గుంజి సురేష్, కె.కోటి, పొటికలపూడి రాము, ప్రసన్న, రమ ణారెడ్డి, అబ్దుల్లా, ఎంపీటీసీ నర్సారెడ్డి, ప్రభాకరరెడ్డి, హనుమంతరావు, కిషోర్, కోటి, నారాయణరెడ్డి, మోహన్, శివారెడ్డి, రామాంజి, షాలిం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *