ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వెంకటాచలం పల్లి వద్ద క్యాంపులో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి నియోజక వర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆయన సతీమణి నందిని, బూచేపల్లి చిన్నారులు ప్రత్యేకంగా కలిసారు. బూచేపల్లి చిన్నారులు విద్యాధర్ రెడ్డి, తన్వికలను సీఎం వైఎస్ జగన్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని నెక్స్ జన్ బూచేపల్లి వారసులు అంటూ వారితో ముచ్చటించారు. వారితో పాటు బూచేపల్లి బంధు మిత్రులు కూడ అందరూ కలిసారు. ఆయనకు జ్ఞాపికను బహుకరించారు.
దర్శి నియోజక వర్గంలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ బాధ్యులు, జెసీఎస్ కన్వినర్లులు, పార్టీ అభిమానులతో కూడ సీఎం వైఎస్ జగన్ తో ప్రత్యేకంగా సమావేశమైనారు. సీఎంతో వారు ప్రత్యేకంగా ఫోటోలను దిగారు.








