ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని గురజాల నియోజక వర్గం ఉమ్మడి అభ్యర్థి యర పతి నేని శ్రీనివాసరావు అన్నారు. గురజాల టౌన్, పెద్ద బావి సెంటర్ షాదిఖానా లో రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన “ఇఫ్తార్ విందు” లో గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు,మైనార్టీ సోదరులకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అన్నారు.ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోసారి చంద్రబాబు నాయుడు నేతృత్వం లోని తెలుగుదేశం పార్టీ అధికారం లోకి రావాలని అన్నారు .ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం అభివృద్ధిని వీడి అరాచకాలను ప్రోత్సహిస్తుందని. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.గురజాల నియోజక వర్గంలో అభివృద్ధి అన్నది ఎక్కడా కనిపించడం లేదన్నారు.గడచిన ఐదేళ్ల పాలనలో గురజాల నియోజక వర్గం లో దోచుకోవడం.దాచుకోవడం తప్ప అభివృద్ధి జరగలేదన్నారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఈ ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేశారు అని ఆయన ఆరోపించారు.రానున్న ప్రభుత్వం ఉమ్మడి కూటమిదే నని.ప్రతి ఒక్కరూ తనకు ఓట్లు వేసి భారీ మెజార్టీ అందించాలని యరపతి నేని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిమ్ సోదరులు పాల్గొన్నారు.


