తాళ్లూరు మండలంలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

తాళ్లూరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్న సంఘటన శుక్రవారం వేకువజామున చోటు చేసుకుంది. ఒంగోలు ప్రత్యేక పోలీసు విభాగం అధికారులు, తాళ్లూరు ఎస్సై వై.వి.రమణయ్య, సిబ్బంది కలిసి తనిఖీల్లో భాగంగా మండలం లోని దోసకాయలపాడు సమీపాన లక్కవరం అడ్డరోడ్డు వద్దకు వచ్చిన రెండు మినీ వ్యాన్ లను పరిశీలించారు. రెండు వాహనాల్లో సుమారు రూ. మూడున్నర లక్షల విలువైన 190 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నారు. వాహనాలను తాళ్లూరు పోలీసు స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. డీటీలు ఆర్వీఎస్ కృష్ణమోహన్, కె. డేవిడ్ రాజు, సీహెచ్. కృష్ణ మోహన్, ఎస్.నారా యణరెడ్డిలు దీనిపై విచారణ చేపట్టారు. బియ్యాన్ని కొత్తపాలెం డీలరు సుబ్బారెడ్డికి అప్పగించారు. వాహన డ్రైవర్లను అదుపులోకి తీసు కొని వారిపై 6ఏతోపాటు, క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *