ఆదివారం టీడీపీలో చేరిన బెల్లంకొండవారిపాలెం సర్పంచ్ పోశం సుమలత భర్త శ్రీకాంత్ రెడ్డి సోమవారం u – టర్న్ తీసుకొని సొంతగూటికి చేరుకున్నారు. దర్శి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్సీపీలో చేరారు. పోశం సుమలత శ్రీకాంత్ రెడ్డి కి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్ది బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ల విజయం కోసం తన వంతు కృషి చేస్తానని సుమలత శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. శ్రీకాంత్ రెడ్డి టిడిపి తీర్థం పుచ్చుకున్న తర్వాత ఉత్కంఠ భరితంగా సాగిన పలు పరిణామాలతో వైసిపి అధినాయకులతో పలు చర్చల అనంతరం శ్రీకాంత్ కు స్పష్టమైన హామీతో ..కథ సుఖాంతంగా ముగియడంతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆయా కార్యక్రమంలో మండల వైకాపా ఇన్ఛార్జీ మస్తాన్ రెడ్డి , జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తూము వెంకట సుబ్బారెడ్డి, సర్పంచ్ లు చిమాట సుబ్బారావు, షేక్ వలి, మండల కోఆప్షన్ సభ్యుడు కరిముళ్ల సొసైటీ మాజీ అధ్యక్షుడు, ఉప సర్పంచ్ పులి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
