ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా దర్శి పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం కురిచేడు రోడ్డులో ఉన్న ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద ఏఐటియు సి జెండాను, మరియు గడియార స్తంభం సెంటర్లో ఉన్న ఏఐటీయూసీ జెండాలను రాష్ట్ర ఏఐటియుసి అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ ఆవిష్కరించగా, పొదిలి రోడ్డులో ఉన్న ఏఐటీయూసీ జెండాలను జిల్లా ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద గడియారస్తంభం సెంటర్లో రవీంద్రనాథ్ మాట్లాడుతూ నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు సాధించిన హక్కులను కాలరాస్తున్నాయని వారిని తిప్పికొట్టేందుకు కార్మికులందరూ ఒక తాటిపై ఉద్యమపాట పట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికాలోని చికాగో నగరంలో పని గంటలు తగ్గించేందుకు కార్మికులు ఐక్యతంగా సమ్మెబాట పట్టి కార్మికులు చేసిన ఉద్యమఫలితమే మేడే అని ఆయన తెలిపారు. కార్మికుల రక్త త్యాగ ఫలితమే ఎర్రజెండా ఏర్పడిందన్నారు. ఈ ఎర్రజెండా స్ఫూర్తితో ప్రతికార్మికుడు ఐక్యతగా ఉండి తమ హక్కుల సాధన కోసం ఉద్యమ బాట పట్టాలన్నారు. కార్మిక వర్గం తమ హక్కులను కాపాడుకునేందుకు సమ్మెలుచేస్తున్న, ఉద్యమాలు చేస్తున్న నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమాలు చేస్తున్న కార్మిక వర్గo పై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారనీ అన్నారు. మేడే స్ఫూర్తితో కార్మికులందరూ ఒక త్రాటిపై నిలబడి తమ హక్కులను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఏఐటీయూసీ అనుబంధ కార్మికులందరూ ఏ ఐ టియు సి జెండాలనుచేతబూని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం నుండి ప్రదర్శనంగా కురిచేడు రోడ్డు, పొదిలి రోడ్డు,అద్దంకి రోడ్ లలో ఏఐటియుసి జెండాలనుఆవిష్కరిస్తూ ప్రదర్శనచేశారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కే హనుమంతరావు, ఉపాధ్యక్షుడు జె కోటేశ్వరరావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్ కరుణానిధి, ఏఐటియుసి నాయకులు కల్లూరి చిన్న అంజనేయులు కాశిరెడ్డి, జీవి సుబ్బయ్య, సిహెచ్ అరుణ, సింగనకొండ శ్రీను, జే శ్రీను ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.




ఇటీవల మరణించిన ఏఐటీయూసీ సీనియర్ నాయకులు కే జీవరత్నం కుటుంబ సభ్యులను దర్శి లో పరామర్శిస్తున్న ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్

