దర్శి పట్టణానికి చెందిన వాకా అఖిల్ రెడ్డి (24) గుండెపోటుతో బుధవారం హైదరాబాద్ లో మృతి చెందాడు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వాకా జనార్దన్ రెడ్డి కుమారుడైన అఖిల్ రెడ్డి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్ర యత్నం కోసం హైదరాబాద్ వెళ్లాడు. ప్రతిరోజు సాయంత్రం స్నేహితులతో క లిసి స్మిమ్మింగ్ పుల్ ఈతకు వెళ్లేవాడు. బుధవారం సాయంత్రం అఖిల్ రెడ్డి ఈతకు వెళ్లగా హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. 108లో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారిం చారు. చేతికందిన కుమారుడి హఠాత్తు మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.



