ఎన్నికల సందర్భంగా ఎస్సై వైవీ రమణయ్య ఆధ్వర్యంలో సిబ్బంది శుక్రవారం తూర్పు గంగవరం వద్ద వాహనాలు తనిఖీ చేశారు. వాహనాల్లోని బ్యాగ్ లు, సూట్‌కేసులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ప్రజలకు కౌన్సెలింగ్
తాళ్లూరు మండలంలోని వెలుగువారిపాలెం గ్రామస్థులకు ఎస్సై వై.వి రమణయ్య కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు నేతలు సహకరించాలన్నారు.

