పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ – శాంతి భద్రతల విషయం లో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి….కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్.

శాంతి భద్రతల విషయంలో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. మంగళవారం
కంటోన్మెంట్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏటువంటి పక్షపాతం లేకుండా పోలీస్ వ్యవస్థ పనిచేయాలని పోలీస్ స్టేషన్ వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాలని, కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో శాంతి భద్రతలను సక్రమంగా కాపాడాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో బేగంపేట ఏసిపి గోపాల కృష్ణమూర్తి ,సర్కిల్ ఇన్స్పెక్టర్ రామయ్య , కార్ఖానా సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ , బోయిన్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి , తిరుమలగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *