మియాపూర్ నుంచి మొదటగా పఠాన్ చెరు , ఆ తర్వాత సంగారెడ్డి వరకు మెట్రో రైలు ను పొడిగించాలని కోరుతూ మెదక్ ఎమ్ పి రఘునందన్ రావు మంగళ వారం బేగంపేట మెట్రో భవన్లో మెట్రో ఎమ్ డీ ఎన్ వి ఎస్ రెడ్డి నీ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.గ్రౌండ్ రిపోర్ట్ తెప్పిస్తామని ,ఆరు నెలల్లోగా పనులకు శంకుస్థాపన చేసే విధంగా కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తానని రఘునందన్ రావు తెలియజేశారు.


