కంటోన్మెంట్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ …… అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా మరియు మహిళా సాధికారిక భవనాలు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి వార్డులో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్లు కోసం ప్రభుత్వ స్థలాలు గుర్తించి వాటికి కేటాయించాలన్నారు. అదేవిధంగా అర్హులైన వారికి రెండు పడకల గదుల ఇళ్ళు కేటాయించాలన్నారు.ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండ సరైన మార్గంలో మీ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తిరుమలగిరి ఎమ్మార్వో అశోక్, డి టి పృథ్వి మారేడు పల్లి ఎమ్మార్వో పద్మ సుందరి , ఆర్ ఐ మల్లేష్ సికింద్రాబాద్ ఎమ్మార్వో పాండు నాయక్ పాల్గొన్నారు.

