అంతర్జాతీయ యోగా దినోత్సవంను తాళ్లూరు మండలంలో ఘనంగా నిర్వహించారు. కస్తూరిభా పాఠశాలలో మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య, హోమియో వైద్యురాలు శిరీష, ప్రిన్సిపాల్ సుజితలు పాల్గొని యోగా ప్రాముఖ్యతను తెలిపి విద్యార్థులచే యోగా చేయించారు. ఎంఈఓ జి సుబ్బయ్య మాట్లాడుతూ నిత్యం యోగా చేయటం వలన శరీరం, మనస్సు ఎకమై మానసిక ప్రశాంతం దొరుకుతుందని అన్నారు. విద్యార్థులకు పలు రకాల యోగాసనాలపై అవగాహన కల్పించారు. ఎబీసీ హైస్కూల్లో యోగా నిపుణుడు డైరెక్టర్ కాలేషా బాబు విద్యార్థులకు యోగా ప్రాముఖ్యతను తెలిపి యోగాసనాలు వేయించారు. లక్కవరం జిల్లా పరిషత్ హైస్కూల్ పీఈటీ, ఉపాధ్యాయులు పాల్గొని, వెలుగు వారి పాలెం (ఎఎ)లో ప్రధానోపాధ్యాయుడు పోలం రెడ్డి సుబ్బా రెడ్డి, ఉపాధ్యాయులు మస్తాన్ పాల్గొని విద్యార్థులకు యోగ ప్రాముఖ్యతను తెలిపి యోగసనాలు వేయించారు.





