స్వార్ధ రహితుడైన హిందుత్వ ఆయుధం శ్యాం ప్రసాద్ ముఖర్జి – నేడు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి

శ్యాంప్రసాద్ ముఖర్జి అంటే హిందు సింహం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ , హిందూ మహాసభ సభ్యునిగా దేశంలో హిందూ ధర్మం కొరకు ప్రత్యేక రాజకీయ పార్టీని స్థాపించిన కల వ్యక్తి. 33 సంవత్సరాల వయసులో కలకత్తా విశ్వవిద్యాలయ కులపతిగా ఐదు సంవత్సరాలపాటు బాధ్యతలు నిర్వహించిన విద్యావేత్త. -1901 జూలై 6న అశుతోష్ ముఖర్జి, జోగ్ మాయాదేవి ముఖర్జి దంపతులకు జన్మించిన శ్యాం ప్రసాద్ ముఖర్జీ 1921లో ఆంగ్ల బాషలో డిగ్రి పట్టాను ప్రధమ స్థానంలో, 1923లో ఎంఏ అనంతరం న్యాయవాద పట్టా పొంది కలకత్తా హైకోర్టులో న్యాయ వాదిగా పేరు నమోదు చేసుకొన్నారు. తండ్రి మరణానంతరం 1927లో ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టరు పట్టా పొంది బారత్ తిరిగి వచ్చారు. విద్యాభ్యాసం నాటినుండే కాంగ్రెస్ వాదిగా రాజకియాలలో చురుకుగా పాల్గొని భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా బెంగాల్ శాసనసభకు ఎన్నికై, అనంతరం జరిగిన పరిణామాలలో తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. తదుపరి జరిగిన ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది మొదటి ప్రావిన్స్ ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. స్వాతంత్ర్యానంతరం జవహర్ లాల్ నెహ్రూ సారధ్యంలోని మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా విధులు నిర్వర్తించారు. 1949లో విభజన చట్టానికి వ్యతిరేకంగా తమ పదవికి రాజీనామా సమర్పించారు. అప్పుడే సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు కాంగ్రెస్ నాయకుల దృష్టిలో ఉన్నతమైన వ్యక్తిగా గౌరవం సంపాదించుకొన్నారు. ముస్లింలీగ్ జిన్నా నిర్వహిస్తున్న ద్విజాతి చర్యలకు బాహాటంగా ఎదురు నిల్చి స్వతం త్రంగా భారత జనసంఘ్ పార్టీని 1951 . 1952 జరిగిన ఎన్నికలలో మూడు స్థానాలు గెలుచుకొని తమదైన హిందూ ముద్ర ను దేశానికి సగర్వంగా చూపారు. 1953 జూన్ 23 వరకు జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగా రు. కరుడుగట్టిన హిందుత్వ వాదిగా గుర్తింపు పొందిన శ్యాంప్రసాద్ ముఖర్జీని స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుత పరిస్థితులలో ప్రతి హిందువూ ముందుకు సాగాలి. భారతీయత హృదయంలో నిలుపుకొని భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించి సోషలిస్టు సిద్దాంతాలకు భిన్నంగా స్వేచ్ఛాయుత వినిమయాలకు మద్దతు వలికిన

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

శ్యాంప్రసాద్ ముఖర్జి. ముస్లింలకు వ్యతిరేకం కాకున్నా భారతదేశంలో హిందువులతో పాటుగా ముస్లిం లకు ఒకే విధమైన పౌరసత్వ నియమాలుం డాలని ఆర్టికల్ 370 పై ముఖర్జి పోరుసల్పినారు. నకల దేవతా స్వరూపంగా హిందువులు పూజించే గోవుల రక్షణకొరకు, గోహత్యలపై తమ గళమును బలంగా వినిపిం చారు. హిందుత్వవాదిగా ప్రజలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇప్పు డున్న దేశ పరిస్థితులలో ముఖర్జి భావజాలం దేశ యువతకు శిరోధా ర్యం కావాలి. హిందుత్వ అజెండా చేపట్టి దేశం యావత్తూ ఒక తాటి పై తేగలిగిన వారి సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ అవపోశన పట్టాలి. శ్యాం ప్రసాద్ ముఖర్జి నిస్వార్ధ సహితుడైన హిందుత్వ ఆయుధమని భారతీయ జనతాపార్టీ నాయకురాలు ప్రకాశం జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బి. విజయరావు ఈ సందర్బంగా  తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *