రాష్ట్రస్థాయి జూనియర్ రగ్బీ టోర్నమెంట్లో తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు జిల్లాపరిషత్ హైస్కూల్ విద్యార్థి గంజ శివరామ కృష్ణకుమార్ ప్రతిభచూపి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. 18 ఏళ్ల లోపు జూనియర్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో భీమునిపట్నంలో జరిగిన పోటీల్లో పాల్గొన్నాడు. ఈనెల 25, 26, 27 తేదీలో పూణెలో జరగనున్న జాతీయ రగ్బీ టోర్నమెంట్లో శివరామకృష్ణ పాల్గొననున్నట్టు పీడీ రవి ప్రసాద్ రెడ్డి తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన రగ్బీ క్రీడాకారుడు శివరామ కృష్ణను హైస్కూల్ హెచ్ఎం పి.సుబ్బారావు, విద్యాకమిటీ చైర్మన్ వై. కృష్ణారెడ్డి, సర్పంచ్ శ్యాంసన్, వైస్ సర్పంచ్ పులి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ బాలకోటయ్య, రిటైర్ట్ టీచర్ ఎస్.అంజిరెడ్డి, సంగన యోగిరెడ్డి తదితరులు అభినందించారు.
