మహాత్మ జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటుజంట నగరాల పరిధిలోనీపలు ప్రాంతాల నుంచి దరఖాస్తుదారులు ప్రజా భవన్ కు తరలివచ్చారు. ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు వివిధ శాఖలకు చెందిన సమస్యలతో వచ్చిన ప్రజలు చిన్నారెడ్డిని ప్రజా భవన్ అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 687 దరఖాస్తులు అందాయి. వీటిలో రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 225 దరఖాస్తులు., హౌసింగ్ కు సంబంధించి 59 దరఖాస్తులు, పౌరసరఫరాల శాఖకు సంబంధించి 82 దరఖాస్తులు, హోం శాఖకు సంబంధించి 47 దరఖాస్తులు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి 40 దరఖాస్తులు ఇతర శాఖలకు సంబంధించి 234 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజావాణి ప్రత్యేక అధికారి దివ్య దేవరాజన్ ఇతర అధికారులు ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతోపాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.



