ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించే వ్యవసాయ డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు దర్శి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపాల్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ పి. సంధ్యారాణి బుధవారం తెలిపారు. ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకొనుటకు 10 వ తరగతి పాస్ అయినవారుతో పాటు ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు 2023 ఆగస్టు 31 వ తేది నాటికి 15 నుండి 22 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలన్నారు. . గ్రామీణ ప్రాంతాలలో ఇంగ్లీషు చదివిన వారికి మున్సిపాలి టీ లలో చదివిన వారికి 75 : 25 నిష్పతి లో సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. డబ్ల్యూ .డబ్ల్యూ. డబ్ల్యు .ఏ ఎన్ జి ఆర్ ఏ యు .ఏసీ .ఇన్ అనే వెబ్ సైట్లో జూన్ 1 వతేది నుండి జూన్ 30వ తేది వరకు దరఖాస్తులు స్వీకరించబడునని స్థానికులకు ఎవరికైనా సందేహలు ఉంటే స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం, ప్రిన్సిపాల్ సైంటిస్ట్ అండ్ హెడ్ద దర్శివ్యవసాయ పాలిటెక్నిక్, దర్శిలో సంప్రదించవలసిందిగా తెలిపారు.
