మెగా డీఎస్సీ పరీక్షకు ఉచిత శిక్షణ-ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఒంగోలు సంచాలకులు యం. అంజల

మెగా డీఎస్సీ 2024 పరీక్షల ఉచిత శిక్షణకు ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి అర్హులైన బీసీ, ఎస్సీ, ఎన్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఒంగోలు సంచాలకులు యం. అంజల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 10వ తేదీ నుంచి 60 రోజులపాటు ఉచిత శిక్షణ ఉంటుందని, ఉచిత శిక్ష ణతోపాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ ఇస్తారన్నారు. అభ్యర్థుల ఎంపిక విధానం, వారికి వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటాతోపాటు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీఈడీ, టీటీసీ మార్కుల నకలు పత్రాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు,
ఆధార్, బ్యాంక్ పాస్ బుక్ నకలు, రెండు పాస్పోర్టు సైజు ఫొటోలతో జూలై 8వ తేదీలోపు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్లో ఉన్న ఏపీ బీసీ స్టడీ సర్కిల్, ఒం గోలు, ప్రకాశం జిల్లాకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివ రాలకు ఏపీబీసీ స్టడీ సర్కిల్, ఒంగోలు, ల్యాండ్ లైన్ నెంబర్ 08592-231232, 9989285530, 89850909262 సంప్రదించాలన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *