ప్రాంతీయ స్థాయి కబ్స్ , బుల్బుల్స్ బాల్ మహోత్సవాన్ని ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఆర్. ధనంజయులు …………..

దక్షిణ మధ్య రైల్వే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ స్థాయి పిల్లల కోసం జూలై 3 నుండి ఈ నెల 7 వ తేదీ వరకు సికింద్రాబాద్‌ సౌత్ లాలాగూడ రైల్వే మిక్స్‌డ్ హైస్కూల్‌లో ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రెసిడెంట్ మరియు దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఆర్. ధనంజయులు ప్రారంభ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి, బుధవారం శిబిరాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ హైదరాబాద్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్, దక్షిణ మధ్య రైల్వే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమీషనర్ దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ పి. కిషోర్ బాబు మరియు సీనియర్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 5 నుండి 10 సంవత్సరాల మధ్య వయస్సుగల బాలబాలికలకు (కబ్స్&బుల్బుల్స్) ఈ బాల్ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవ్‌కు హాజరయ్యే అబ్బాయిలను కబ్స్ అని, అమ్మాయిలను బుల్బుల్స్ అని పిలుస్తారు. దక్షిణ మధ్య రైల్వే ఈ ఈవెంట్‌ను రాష్ట్రంలో నిర్వహించడం ఇదే తొలిసారి. గతంలో, దక్షిణ మధ్య రైల్వే 1980 సంవత్సరంలో సికింద్రాబాద్‌లో 1వ ఆల్ ఇండియన్ రైల్వేజాంబోరెట్‌ను మరియు 2002 సంవత్సరంలో 10వ ఆల్ ఇండియా రైల్వే జాంబోరెట్‌ను హుబ్లీలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సికింద్రాబాద్‌లో 2022 సంవత్సరంలో ప్రాంతీయ యోగా ఫెస్ట్‌ను నిర్వహించింది మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్కోసం అనేక రాష్ట్ర స్థాయి ర్యాలీలను నిర్వహించింది.
ఆర్.ధనంజయులు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో ని వివిధ దళాలను మరియు బాలబాలికలను ఉద్దేశించి ప్రసంగిస్తూ స్కౌటింగ్ అండ్ గైడింగ్ సంస్థకు బాలబాలికలే పునాది అని అన్నారు. ఈ వయస్సులో, వారు డ్రాయింగ్ మరియు పెయింటింగ్, స్టోరీటెల్లింగ్, యాక్టింగ్ మరియు సాహసోపేతా కార్యక్రమాలలో పాల్గొనేందుకై వారి నైపుణ్యాన్ని మరియు ప్రతిభను పెంపొందించుకోవడం వంటి అంశాలను శ్రద్ధగా నేర్చుకుంటారు. బాల్ మహోత్సవం వంటి కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున వివిధ సంస్కృతులు మరియు వారసత్వం నుండి వచ్చిన చిన్న పిల్లలకు ఒకే వయస్సుగల వారితో కలిసిమెలసి క్యాంపింగ్ చేయడానికి అవకాశం కల్పిస్తుందని ఆయన తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చిన్నపిల్లలను సమర్థతతో కూడిన బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుతాయని అన్నారు .
దక్షిణ మధ్య రైల్వే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర కార్యదర్శి మరియు దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ. సి. ఏం. ఏం, కోచింగ్, ఏ. కె. రావత్ కృతజ్ఞతా ధన్యవాదాలు  తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *