తెలంగాణ సాయుధ పోరాట రైతాంగవీరుడు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య………….78 వ వర్ధంతి సందర్భంగా నేతల నివాళులు……

తెలంగాణ సాయుధ పోరాట రైతంగ వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని పలువురు స్మరించుకున్నారు. స్వాతంత్ర సమరయోధులు అభ్యుదయ బావ విప్లవ వీరులు దొడ్డి కొమరయ్య 78 వ వర్ధంతిని పురస్కరించుకొని రాంగోపాల్ పేట్ పాన్ బజార్ లోని చీరె కార్యాలయంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చీర సత్యనారాయణ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబిసి మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య విప్లవ వీరులని తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం చేస్తూ ఆయన అమరుడయ్యాడని అన్నారు ఆయనను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు గొర్రెల కాపరిగా ఉంటూ ఆయన సాయుధ పోరాటాన్ని చేశాడని అన్నారు ఏప్రిల్ 3 న కొమరయ్య ఘట్టమ్మ కొండయ్య లకు జన్మించాడని అన్నారు 1946 జూలై 4న ఆయన అమరుడయ్యారన్నారు .ఈ సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద నాయకులు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సంజయ్ గనాటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం నందకర్ కోశాధికా రమేష్ ఒబిసి మోర్చా కార్యాలయ కార్యదర్శి శరత్ ఠాకూర్ సహకార దర్శి ప్రభు పూజారి లతోపాటు డివిజన్ కార్యదర్శి ఎస్సీ నరేష్ ఓబి అధ్యక్షులు ఓబీసీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ ప్రవీణ్ కుమార్ నరేంద్ర పాల్ దయచేసి శ్రీనివాస్ జిల్లా డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *