ద్విచక్ర వాహనదారున్ని బస్సు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం జరిగింది. ఈ సంఘటనలపై పోలీసులు తెలిపిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి మూసాపేట ఆంజనేయ నగర్ కు చెందిన తోట విష్ణు ప్రభు 58 రైల్వే ఉద్యోగి రైల్వే మెడికల్ స్టోర్ చిలకలగూడ సికింద్రాబాద్ లో గురువారం సాయంత్రం తన విధులు ముగించుకుని తన టీఎస్ 08 జీ ఎక్స్ 18 24 యాక్టీవా పై మూసాపేట ఆంజనేయ నగర్ కు బయలుదేరాడు తివోలి థియేటర్ సమీపంలోని సిఏ డబ్ల్యూ మెస్ వద్దకు ఐదు గంటలకు చేరుకున్నాడు ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి బోధన్ కు వెళ్తున్న టి.ఎస్ 16 జెడ్ 0 2 8 5 నెంబర్ గల బస్సు విష్ణు ప్రభు ప్రయాణిస్తున్న యాక్టివాను బలంగా ఢీకొంది ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై నుంచి అతను కింద పడిపోయాడు ఇదే సమయంలో బస్సు వెనుక టైర్లు అతని తలపై నుంచి ఎక్కడంతో తల నుజ్జునుజ్జయింది ప్రాణాలు కోల్పోయాడు ఇది గమనించిన వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న మృతుని కుమారుడు తోట చంద్ర కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై నాగరాజ్ తెలియజేశారు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు
