కుష్టు వ్యాధి ఇంటింటి సర్వే విజయవంతం చెయ్యాలి – లెప్రసీపై ఆరోగ్య, ఆశ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహణ

కుష్టు వ్యాధి నివారణకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు డీపీఎంఓ సుబ్బా రెడ్డి తెలిపారు. తాళ్లూరు పీహెచ్ సీలో మంగళవారం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ షేక్ ఖాదర్ మస్తాన్ బి ఆధ్వర్యంలో వైద్య, ఆరోగ్య సిబ్బందికి లెప్రసీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీపీఎంఓ సుబ్బా రెడ్డి మాట్లాడుతూ … కుష్టు వ్యాధి లక్షణాలను వివరించారు. ఆయా లక్షణాలు ఉంటే గుర్తించి తక్షణమే సిఫార్స్ చెయ్యాలని కోరారు. జులై 18 నుండి ఆగష్టు 2 వరకు ఇంటింటి సర్వే నిర్వహించబడునని తెలిపారు. వైద్యుడు డాక్టర రాజేష్, సూపర్ వైజర్ రవి కుమార్, లెప్రసీ నోడల్ అధికారి, హెచ్ వీ కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *