శ్రీ కాళిదాస్ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యాసామగ్రి పంపిణీ.

ప్రతి ఒక్కరి జీవితంలో విద్య ఉన్నత స్థానంలో నిలుపుతుందని, ఆర్థికలేమితో ఏ ఒక్కరు విద్యకు దూరం కాకూడదనే భావనతో శ్రీ కాళిదాసు సేవా సమితి పని చేస్తుందని సమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు తీగల సత్యవతి పేర్కొన్నారు. నగరంలోని ఎన్టీఆర్ కాలనిలోని రెడెమ్షన్ అనాధబాలల వసతి గృహ నిర్వాసిత పిల్లలు స్థానికముగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు నిర్వాహకులు కోరిక మీదట ఆ విద్యార్థులకు విద్యాసామగ్రి నోట్ పుస్తకాలు పెన్సిళ్లు పెన్నులను ప్రవాస భారతీయులు అప్పన్న శ్రీనివాస్ నళిని దంపతుల సహకారంతో మంగళవారం స్ట్రీట్ చిల్డ్రన్ హోం లో ఏర్పాటు చేసిను ప్రత్యేక కార్యక్రమంలో అందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా గుర్రం సత్యనారాయణ మాట్లాడుతూ నిర్వాహ అధ్యక్షురాలు తీగల సత్యవతి కోరిన మీదట ప్రవాస భారతీయుల సహకారంతో విద్యార్థులకు విద్యా సామగ్రిని అందించడం జరిగిందని తెలిపారు ఏదైతే లక్ష్యంతో సేవాసమితిని స్థాపించారో ఆ లక్ష్య సాధన దిశగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సత్యవతి కృషి చేస్తున్నారని అభినందించారు.

కార్యక్రమంలో తీగల సత్యవతి, గుర్రం సత్యనారాయణ, చీమకుర్తి శివప్రసాద్, సుభాదేవి, శ్రీనివాసరెడ్డి, ధనిశెట్టి రామునాయుడు, హోం నిర్వాహకులు బిందు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *