హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ,సిగ్నల్ జంప్ చేయడం ,ప్రమాదకరమని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏసిపి జి శంకర్రాజు అన్నారు .గురువారం పెట్ల బురుజు సి టి సి లో పోలీస్ ట్రైనింగ్ విద్యార్థులు, సిబ్బందికి రోడ్డు ప్రమాదాలు నివారణ అనే అంశంపై ఏసీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు .ముఖ్యంగా యువత రెడ్ సిగ్నల్స్ పడినప్పుడు తమ వాహనాలను మరింత వేగంగా ముందుకు కదిలిస్తూ మరోవైపు నుంచి వస్తున్న వాహనదారులను సైతం ప్రమాదాలకు గురి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎక్కువమంది యువకులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారని, ఇలాంటి సమయంలో ప్రమాదం జరిగి గాయపడినట్లైతే వారి కుటుంబాలు తీవ్ర శోకంతో ఉండిపోతున్నాయి అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. రెడ్ సిగ్నల్ పడిన సమయంలో వాహనాలను తప్పకుండా నిలిపి ఉంచాలన్నారు .ప్రతి యువకుడు ,యువతి తప్పకుండా లైసెన్స్ పొందిన తర్వాతనే వాహనాలను నడపాలని ఏసిపి సూచించారు. లైసెన్సు లేకుండా వాహనాలు నడిపినట్లయితే రూ 5000లు జరిమానా తో పాటు మూడు నెలల జైలు శిక్ష విధిస్తారని అన్నారు .రాంగ్ సైడ్ లో కూడా వాహనాలను అస్సలు నడపకూడదు అని అన్నారు. ఒక్క నిమిషంలో ఏమి జరుగుతుందిలే ,ఇక్కడే కదా అని అనుకుంటూ కొందరు రాంగ్ సైడ్ లో ప్రయాణిస్తున్నారని, వారి వల్ల రాంగ్ సైడ్ లో ప్రయాణిస్తున్న వారితో పాటు ఎదురుగా వస్తున్న వాహనదారులు ప్రమాదాలకు గురై గాయపడే అవకాశం ఉంటుందన్నారు. వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా నడప కూడదని ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో 300 మంది పోలీస్ ట్రైనింగ్ విద్యార్థులు ప్రిన్సిపాల్ అదనపు డీసీపీ ఎం శ్రీనివాసరావు వైస్ ప్రిన్సిపాల్ ఏసిపి కె వెంకటేశ్వర్లు ఆర్ఐ అడ్మిన్ దిలీప్ కుమార్ కె మారుతి ప్రసాద్ మీ సైదులు పెట్ల బురుజు సిబ్బంది పాల్గొన్నారు.


