వాసవి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశం లో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్…..సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ…….

కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధి వాసవి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందరి సహకారంతోనే తనకు ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కిందన్నారు.ఈ సందర్భంగా తాను ప్రతి ఒక్కరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు డ్రైనేజ్,రోడ్లు,మంచినీరు సదుపాయం,దోమల బెడద ఎక్కువగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు..స్పందించిన ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలు అన్ని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సభాముఖంగా హామీ ఇచ్చారు. అనంతరం అసోసియేషన్ సభ్యులతో కలిసి ఓల్డ్ వాసవి నగర్ లో ఎమ్మెల్యే పర్యటించి డ్రైనేజ్ లైన్, రోడ్డుపైనే చెత్త, ఉండటాన్ని పరిశీలించారు,ఈ సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జై నాగశ్వర్ రావు, ఉపాధ్యక్షుడు బొజ్జ అజయ్,అసోసియేషన్ మెంబర్ తేలుకుంట అరుణ్ జ్యోతి సతీష్ గుప్తా,భాస్కర్, కోట నాగేశ్వరరావు, రేపాల వెంకటేశ్వర్లు,రవికాంత్,తెరాల శ్రీనివాస్,అమర్నాథ్,వసుంధర మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *