ఆషాడ మాస బోనాలు ఉత్సవాలలో భాగంగా బేగంపేట ప్రకాశం నగర్ శ్రీ భూలక్ష్మి అమ్మవారు శుక్రవారం రోజున పూల అలంకారం లో కన్నుల నిండుగా భక్తులకు దర్శనం ఇచ్చారు .రానున్న మూడు వారాల్లో కూడా ప్రతివారం ఒక అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ నిర్మాణ దాత విశాల్ సూధం తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తగా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు .రానున్న మూడు వారాల్లో శాకంబరి అలంకారం, గాజులతో అలంకారం, పండ్లతో అలంకారం ,ఉంటుందన్నారు. ప్రతి శుక్రవారం ఆలయంలో భగవద్గీత పారాయణం చేస్తున్నట్లు విశాల్ తెలియజేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.
