తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ ప్రియాంక గాంధీ సేన కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని రాహుల్ రాహుల్ ప్రియాంక గాంధీ సేన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , తెలంగాణ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ ఫయాజ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బేగంపేట పాటిగడ్డలోని కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను అమలుపరుస్తూ ముందుకు వెళుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పలు జిల్లాలకు రాహుల్ ప్రియాంక గాంధీ సేన కాంగ్రెస్ కు జిల్లా కమిటీల నియామకం కొంతమేర పూర్తయిందని రానున్న కాలంలో పూర్తిస్థాయిలో కమిటీల నియామకం చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. తాజాగా కొంతమందితో కమిటీని నియమించినట్లు వారికి నియామక పత్రాలు అందజేసినట్లు తెలియజేశారు. తాజాగా సనత్ నగర్ నియోజకవర్గం రాహుల్ ప్రియాంక గాంధీ సేన కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులుగా వాజిద్ ఖాన్, ఉపాధ్యక్షులుగా షేక్ ఆరిఫ్ యూత్ వైస్ ప్రెసిడెంట్ గా ఓర్చు అశోక్, జాయింట్ సెక్రటరీగా షేక్ మహబూబ్ పాషా, వైస్ ప్రెసిడెంట్ గా షేక్ కాలేదు, సనత్ నగర్ నియోజకవర్గం మైనార్టీ వైస్ ప్రెసిడెంట్గా మహమ్మద్ రియాజుద్దీన్ ప్రధాన కార్యదర్శిగా పల్లె బాలు స్వామి సనత్ నగర్ సెక్రటరీగా గల్లా సరస్వతి తదితరులకు రాహుల్ ప్రియాంక గాంధీ సేన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు మొహమ్మద్ ఫయాజ్ నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా వారు మహమ్మద్ ఫయాజ్ ను శాలువాలు పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఫయాజ్ మాట్లాడుతూ రాహుల్ ప్రియాంక గాంధీ సేన కాంగ్రెస్ సేవలను మరింత విస్తృతంగా చేపట్టాలని పేదలకు అన్ని విషయాలలో అండగా నిలవాలని ఆయన కోరారు. పేదలకు ప్రభుత్వ సాయం అందించడంలో రాహుల్ ప్రియాంక గాంధీ సేన కాంగ్రెస్ ముందుండి తమ సహాయ సహకారాలు అందించాలని సూచించారు.




