ఆషాడ మాసం బోనాలు పండుగ సందర్భంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బేగంపేటలోని శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి దేవస్థానంలో ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఫౌండర్ చైర్మన్ చెక్కల సుభాష్ ముదిరాజ్, ఈవో వంగ అంబుజాల ఆధ్వర్యంలో భక్తులకు ముందస్తు ఏర్పాటు చేశారు. తీర్థ ప్రసాదాల వితరణ గావించారు.



