మహంకాళి దేవాలయంలో ఉత్సవ కమిటీ సభ్యుడికే అవమానం…….ఈవో కార్యాలయం నుంచి బలవంతంగా బయటకు లాక్కొచ్చిన బీఆర్ ఎస్ నాయకుడు………….

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాలు దగ్గరపడుతున్న సమయం లో రాజకీయాలు రసకందాయం గా మారుతున్నాయి.రాష్ట్రం
లో కాంగ్రెస్ పార్టీ అధికారం
లో ఉండగా, ప్రస్తుతం సనత్ నగర్ ఎమ్మెల్యే గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. అయితే
ఈ బోనాల ఉత్సవాలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులతో ఇటీవల ఉత్సవ కమిటీని నియమించారు. అయితే గత కొద్ది ఏళ్లుగా ఇక్కడ మంత్రిగా, ఎమ్మెల్యేగా తలసాని శ్రీనివాసయాదవ్ అన్నీ తానై వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన ఈ జాతరలో అంటీ ముట్టనట్లు గా ఉంటున్నారు. అయితే బీ ఆర్ ఎస్ కు చెందిన కింది స్థాయి కార్యకర్తలు మాత్రం ఇన్నాళ్లు తాము జాతరలో ఆధిపత్యం చలాయించగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్సవ కమిటీ సభ్యులుగా రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదివారం మాజీ కార్పొరేటర్ అత్తిలి కుటుంబం నుంచి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఈ సమయంలో ఈవో కార్యాయంలో ఉత్సవ కమిటీ సభ్యుడు శ్రీకాంతాచారి కూర్చుని ఉన్నారు. ఈవో కార్యాలయానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీకి చెందిన మహేష్ యాదవ్ అక్కడే కూర్చుని ఉన్న ఉత్సవ కమిటీ సభ్యుడిని మా వాళ్లు లోపల కూర్చుంటున్నారు. నువ్వు భయటకు వచ్చెయ్ అంటూ బలవంతగా చెయ్యి పట్టుకుని లాక్కుని ఈవో చాంబర్ నుంచి బయటకు వచ్చారు. అక్కడే ఉన్న మహంకాళి పోలీసులు వారించినా ఆయనను బలవంతంగా బయటకు లాక్కుని రావడం పట్ల శ్రీకాంతాచారి తీవ్ర అవమానంగా బావించి
ఈ ఘటనను పార్టీ పెద్దలకు చేరవేశారు. తమ పార్టీ అధికారంలో ఉండగా తనకు ఇంత అవమానం జరుగడంతో ఈ పదవి అవసరం లేదని రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. అలాగే ఈవో మనోహర్ రెడ్డి కూడా జరిగిన విషయం పై ఆయన ఫిర్యాదు చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *