రైతుకు ప్రత్యేక గుర్తింపు నంబర్ -వ్యవసాయాధికారి బి.ప్రసాదావు

ప్రభుత్వం ప్రతి రైతుకు ప్రత్యేక గుర్తింపు నంబరును అందజేయనున్నట్లు మండల వ్యవసాయాధికారి బి.ప్రసాదావు తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ఆధునీకరణ చేయుటకు కేంద్ర ప్రభుత్వం రైతులకు 14 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య యూనిక్ ఐడీ, ఆధార్ కార్డు తరహాలో రైతులకు అందిస్తుందని, సొంత భూములు కలిగిన ప్రతి రైతు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలు రైతులు పొందాలంటే 14 అంకెల గుర్తింపు సంఖ్య తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అన్నారు. రైతులు ఆయా గ్రామాలలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్లి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ జిరాక్స్, ఆధార్ నెంబరుకు లింక్ అయిన ఫోన్ నెంబరును తీసుకొని గ్రామ వ్యవసాయ సహాయకులను కలిసి నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *