పొదుపుమహిళల ఆర్ధికఅవసరాలకు అనుగుణంగా వార్షిక క్రెడిట్ ప్రణాళికలుసిద్ధం చేయాలి

పొదుపు మహిళా గ్రూపుసభ్యులకు సంబందించి 2025-2026 వార్షిక క్రెడిట్ ప్రణాళికల యాక్షన్ ప్లాన్ సర్వేలను వారం రోజుల్లో పూర్తి చేయాలని డీఆర్డీఏ పీడీ పి. నారాయణ తెలిపారు. శివరాంపురం గ్రామంలో విఓఏలు, ఎన్యుమరేటర్లు నిర్వహిస్తున్న సర్వేను పిడి పరిశీలించారు. ఈ సందర్బం గా మాట్లాడుతూ పొదుపు మహిళలు రానున్న సంవత్సరంలోఆర్ధిక అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. పొదుపు మహిళలకు ఎలాం టిఅవసరాలు ఉన్నాయి, ఎటువంటి వ్యాపారాలు చేస్తారు, తాము చేపట్ట బోయో పనులకు ఎంత మేర నిధులు అవసరమో సర్వేకు వచ్చిన బృందానికి తెలియపరిచి నమోదు చేయించాలన్నారు. విద్యాసంవత్సరంలో పిల్లలకు చెల్లించాల్సిన ఫీజుల వివరాలను స్పష్టంగా నమోదు చేయించాలన్నారు. వార్షిక క్రెడిట్ ప్రణాళికలో అన్నినమోదు చేయించాలన్నారు. విషయాలు నమోదు చేయటం వల్ల ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి సహ కారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం పి. దేవరాజ్, విఓఏలు, యానిమేటర్లు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *