కందుల కొనుగోలు కేంద్రాన్ని రైతులు వినియోగించుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. బొద్దికూర పాడు లో నాగంబొట్ల పాలెం సొసైటీ పరధిలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. 85 మంది రైతుల వద్ద 75.15 మెట్రిక్ టన్నులు రూ. 50 లక్షల విలువైన కందులు మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లు చెపాపరు. సమీప రైతులు మద్దతు ధరకు కందులను అమ్ముకోవాలని కోరారు. అనంతరం రైతులకు భూసార పరీక్షలపై అవగాహన కల్పించారు. ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, నీటి సంఘం అధ్యక్షుడు వై కోటి రెడ్డి, ఎవోలు రైతులకు భూసార కార్డులను అందించారు. విఆర్ చిన క్రిష్ణయ్య, కార్యదర్శి షహనాజ్ బేగం, విఏఏ అజ్మీర్ తదితరులు పాల్గొన్నారు.
