బొద్దికూరపాడులో జూనియర్ ఎన్ టి ఆర్ జన్మదినోత్సవం పురష్కరించుకుని శనివారం బీసీ కాలనీ ఎన్ టిఆర్ అభిమానులు రక్త దాన శిబిరం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో 37 మంది యువతీ యువకులు రక్తదానం చేసారు. మారు మూల గ్రామ మైన బొద్దికూర పాడులో రక్తదాన శిబిరం నిర్వహించటం అభినందనీయమని ఇది భవిష్యత్లో లో మంచి సేవా కార్యక్రమాలకు ఇది పునాది అవుతుందని వక్తలు అన్నారు. దాతలకు అభినందన సర్టిఫికేట్స్ అందించారు. అభిమానులు పండ్లు, స్వీట్లు పంపిణీ చేసారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, సెక్రటరీ షహనాజ్ బేగం, టిడిపి నాయకులు పోలం రెడ్డి రమణా రెడ్డి, ఉపాధ్యాయులు పోలం రెడ్డి సుబ్బా రెడ్డి, గ్రామస్తులు చిన్నపు రెడ్డి వెంకా రెడ్డి, షేక్ షరీఫ్, బూచి రాజు రాము కాకునూరి కోటి రెడ్డి, ధరణి కోట హరి క్రిష్ణ, షేక్ నాగూర్, షేక్ విలాస్, షేక్ కాజా, షేక్ బాజి, గజ్జల శ్రీను, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

