ప్రతి నెల మూడో శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంను ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, సిబ్బంది జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్లలో “క్లీన్ అండ్ గ్రీన్” కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ లలో శుభ్రం చేయడంతో పాటు ఆవరణం మరియు చుట్టూ ఉన్న చెత్త, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. గుణపం, పారలు చేతబట్టి పిచ్చి మొక్కలు తొలగించారు. చెట్లకు పాదులు తీసి నీరు పోశారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ లు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా ఈ కార్యక్రమం చేపట్టారు. మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని అందువలన మనసు ప్రశాంతతతో కూడి ఆరోగ్యకర వాతావరణంలో, క్రమశిక్షణగా విధులు నిర్వర్తించొచ్చని జిల్లా ఎస్పీఆర్ దామోదర్ సందేశం ఇచ్చారు.

