అధర్మంపై ధర్మం గెలిచింది

– రాంగోపాల్ పేట కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

రామ్ గోపాల్ పేట జూన్ 9(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆధర్మంపై ధర్మం విజయం సాధించిందని రామ్ గోపాల్
పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ అన్నారు.సోమవారం కోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో సోమవారం ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు. 2020 జిహెచ్ఎంసి ఎన్నికలలలో బేగంపేట్ డివిజన్ కు చెందిన 270 ఓట్లు రాంగోపాల్ట్ పేట్ డివిజన్ కు మళ్ళించి వాటిని బీజేపీ అభ్యర్ధికే పడేలా చేశారని ఆరోపించారు.
ఆ విషయమైన తమకు వ్యతిరేకంగాజిహెచ్ఎంసి,
ఆర్వోతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై ఎలక్ట్రోల్ కోర్టుకు వెళ్లగా ఆ కోర్టు ప్రధాన న్యాయపూర్తి బీఆర్ఎస్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ కు వ్యతిరేకంగా తీర్పు వెల్లడించారు.కేసును డిస్మిస్ చేస్తూ తీర్పు నిచ్చిందని ఆమె చెప్పారు.గతంలో ఈ విషయం పై హై కోర్టులో లో కూడా కేసు వేశారని అక్కడ కూడా కోర్టు కేసును డిస్మిస్ చేసిందని దానిపై కూడా మరల ఆపిల్ కు వెళ్లగా కోర్టు కొట్టివేసిందని చెప్పారు. అన్యాయం, అధర్మం, అరాచకాలతో ఎమి సాధించలేమనే విషయాన్ని గుర్తించాలన్నారు.న్యాయస్థానం తీర్పుతో ఈ విషయం స్పష్టమైందని ఆమె పేర్కొన్నారు.ధర్మానికి ఒడిదుడు కులు ఉంటాయి కాని ఓటమి ఉండదనే విషయాన్ని గ్రహించాలని సూచన చేస్తున్నానన్నారు. అధర్మం ఎప్పుడూ గెలవదని.ధర్మమే గెలుస్తుందని చీర సుచిత్ర శ్రీకాంత్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *