ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కరించేందుకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఏ.ఆర్ దామోదర్
మరియు పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (మీ కోసం) నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారులు స్వేచ్ఛాయుత వాతావరణంలో వారి లిఖితపూర్వక అర్జీలతో వారి సమస్యల గురించి ధైర్యంగా పోలీస్ అధికారులకు విన్నవించుకున్నారు. పోలీస్ అధికారులు ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడి వారి ఫిర్యాదుల పూర్వాపరాలను అడిగి తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో అందిన ఆయా ఫిర్యాదులపై సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భర్త/అత్తారింటి వేధింపులు, చీటింగ్/జాబ్ ఫ్రాడ్, భూ వివాదాలు మరియు ఇతర సమస్యల గురించి ప్రజా పిర్యాదులు వచ్చాయి.
ఈ రోజు మీ కోసం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని…..
తనకు మరియు తన స్నేహితుడికి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒంగోలు పేర్నమిట్ట కు చెందిన ఒక వ్యక్తి మరియు మరో ఇద్దరు వ్యక్తులతో కలసి రూ.5,50,000/- డబ్బులు తీసుకొని ఫేక్ ఆఫర్ లెటర్ ను వారి యొక్క మెయిల్ కు పంపి మోసం చేసినట్లు పొదిలి గ్రామానికి చెందిన ఒక బాధితుడు ఫిర్యాదు.
తన ఇంటిని తనఖా పెట్టి ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వారి దగ్గర నుండి రూ.4,00,000/- లోను తీసుకుని క్రమం తప్ప కుండా ప్రతి నెల ఈఎంఐ రూ.11,500/- ఆ ఫైనాన్స్ కంపెనీ కి సంబంధించిన వ్యక్తికి చెల్లిస్తున్నట్లు మరియు ఆ వ్యక్తి కంపెనీలో జాబ్ మానేసిన తర్వాత కూడా తమ వద్ద నుండి డబ్బులు తీసుకుని ఫైనాన్స్ వారికి చెల్లించకుండా మోసం చేశారని మర్రిపూడి మండలానికి చెందిన ఒక మహిళ ఫిర్యాదు.
తాను ఓఎల్ఎక్స్ లో ఆపిల్ వాచ్ ను గుంటూరు చెందిన ఒక వ్యక్తి వద్ద రూ.19,000/- కొనుగోలు చేసి, వాచ్ ను తీసుకున్న తర్వాత ఆ వాచ్ రిపేర్ లో ఉన్నదని తెలుసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అడుగుతుంటే ఇవ్వటం లేదని ఒంగోలుకు చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు.
ఈ కార్యక్రమంలో మహిళ డిఎస్పీ రమణ కుమార్, సిసియస్ ఇన్స్పెక్టర్ జగదీష్, ఎస్సీ ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్, డీటీసి ఇన్స్పెక్టర్ షమీముల్లా, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

