ప్రకాశం జిల్లా ఎస్పీఏ.ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ వి సూర్యనారాయణ మరియు వారి సిబ్బంది
సైబర్ నేరాల నివారణ మరియు గుర్తించడం కొరకు ఒంగోలులోనే అన్ని బ్యాంక్ అధికారులతో ఒంగోలులో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో నగదు లావాదేవీలకు సంబంధించి జరిగే ఆర్థిక నేరాలు మరియు సైబర్ నేరాలు ముఖ్యంగా ప్రజల అత్యాశ, భయాందోనలను ఆసరాగా చేసుకొని ఫేక్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, అపరిచితుల నుంచి ఎస్ఎంఎస్, ఈ-మెయిల్, వాట్సప్ల ద్వారా వచ్చే ఫేక్ లింక్స్, ఫేక్ లోన్ యాప్స్, డిజిటల్ అరెస్ట్, ఆన్ లైన్ మోసాలు, ఫేక్ బ్యాంక్ పాలసీ, బ్యాంకు రివార్డ్స్ మరియు ఇతర స్కామ్ ల గురించి బ్యాంక్ అధికారులకు ఐటీ కోర్ సీఐ అవగాహన కల్పించి వాటి నివారణకు బ్యాంకులు తీసుకోవాల్సిన చర్యల గురించి వారికి వివరించారు.

