తాగునీటి సరఫరాకు మెరుగైన చర్యలు -ఎంపీడీవో ఎం శ్రీదేవి -ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఎంపీడీవో సమీక్ష

ముండ్లమూరు మండలంలోని అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరాకు మెరుగైన చర్యలు చేపట్టాలని ఎంపీడీవో ఎం శ్రీదేవి ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రతి గ్రామానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా త్రాగునీటి సరఫరా చేయాలన్నారు. ఎక్కడైనా పైపులకు లీకులు ఏర్పడితే యుద్ధ ప్రాతిపదికన చేపట్టి త్రాగు నీటిని పునరుద్దించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏ ఈ ఏ హనుమాన్ బాబు, మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ సింగంశెట్టి సత్యనారాయణ, పలువురు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *