మాడపాకుల నారాయణమ్మ కి అభినందనల వెల్లువ -దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి వరించటంతో శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ జిల్లా నాయకులు – సీఎం, డిప్యూటీ సీఎం కి, బిజెపి అధిష్టానానికి కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపిన బిజెపి శ్రేణులు

దర్శి పట్టణానికి చెందిన మాడపాకుల నారాయణమ్మ మార్కెట్ యాడ్ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా బిజెపి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని మాడపాకుల శ్రీనివాస్ దంపతులకు అభినందనలు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసులు నారాయణమ్మ ని ఘనంగా సన్మానించి, అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..”ఈ పదవిని అందించడంలో సహకారం అందించిన రాష్ట్ర కూటమి నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ , 20 సూత్రాల చైర్మన్ లంక దినకర్ , సన్నారెడ్డి దయాకర్ రెడ్డి , టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ , మాజీ ఎమ్మెల్యే నారపు శెట్టి పాపారావు , చైర్మన్ పిచ్చయ్య లకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ అవకాశాన్ని కూటమి తరపున గౌరవంగా స్వీకరించి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలని మాడపాకుల శ్రీనివాస్ నారాయణమ్మ దంపతులను కోరారు.
కార్యక్రమంలో మాడపాకుల శ్రీనివాసులు (అసెంబ్లీ కన్వీనర్), జిల్లా ప్రధాన కార్యదర్శి కూకట్ల నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు తిండి నారాయణరెడ్డి, మండల అధ్యక్షులు మరియు బీజేపీ పార్టీ కార్యకర్తలు పాల్గొని నారాయణమ్మ కి శుభాకాంక్షలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *