సీఎం ప్రజావాణిలో 328 దరఖాస్తులుదరఖాస్తులు స్వీకరించిన చిన్నారెడ్డి, దివ్య దేవరాజన్

బేగంపేట ఆగస్టు 12,జే ఎస్ డి ఎం న్యూస్
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 328 దరఖాస్తులు అందాయి.
వాటిలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 57 దరఖాస్తులు, రెవెన్యూ శాఖకు సంబంధించి 51, ప్రవాసి ప్రజావాణికి 01, విద్యుత్ శాఖకు 36, ఇందిరమ్మ ఇండ్ల కోసం 111 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 72 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు
సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ దరఖాస్తులు స్వీకరించి ప్రజల సమస్యలు విని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను  పరిష్కరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *