తాళ్లూరు-1 సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ (గ్రేడ్-6కార్యదర్శి ) షేక్ బాజ్జీని వర్కింగ్ అరేంజ్మెంట్ కింద జిల్లా కలెక్టర్ టి.అన్సారియా ఆదేశానుసారం ఒంగోలు డియల్పివో కార్యాలయంకు డిప్యూటేషన్ పై
బదిలీ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మహిళా ఉద్యోగి (డిజిటల్ అసిస్టెంట్)ను బదిలీ కాబడిన డిప్యూటీ ఎంపీడీవో హనుమంతరావు, తాళ్లూరు-1 సచి వాలయపంచాయతీ కార్యదర్శి ఐ.వి.రమణారెడ్డిలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నా రని, తనను డిప్యూటేషన్పై బదిలీ చేయాలని, పలుఆరోపణలు చేస్తూ జిల్లాకలెక్టర్ కు డిజిటల్ అసిస్టెంట్ విన్నవించారు. తక్షణమే తగుచర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశాల మేరకు ఆమహిళా ఉద్యోగినిని ఒంగోలు డిఎల్పివో కార్యాలయంకు డిప్యూ టేషన్ పై బదిలీ చేస్తూ డిపీవో ఉత్తర్వులు జారీ చేశారు.
తాళ్లూరు1-సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ బాజ్జీ డిప్యూటేషన్ పైడిఎల్పివో ఆఫీస్ కు బదిలీ
13
Sep