తెలంగాణ ప్రభుత్వంలో పోలీస్ శాఖలో బడ్జెట్ సెక్షన్ లో సమర్థవంతంగా సేవలు అందించిన ప్రకాశం జిల్లా, తాళ్లూరు మండల కేంద్ర వాసి కోట వెంకట సుబ్బా రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ పోలీస్ సేవా పథకం అందించింది. పోలీస్ శాఖలోని బడ్జెట్ సెక్షన్లో సమర్థవంతంగా సేవలు అందిస్తుంన్నందుకు గుర్తింపుగా పోలీస్ బెటాలియన్ లో, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సేవా పథకాన్ని అందిస్తున్నారు. 2026లో సేవా పథకాలను ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీఓ నంబర్ 144ను విడుదల చేసారు. అందులో బాగంగా హైదరాబాద్ టీజీపీఎస్ బెటాలియన్లో గత ఏడు సంవత్సరాలు గా సేవలు అందించిన కెవీ సుబ్బా రెడ్డి హెచ్ సీ-23, ఫస్ట్ బెటాలియన్, యూసఫ్ గూడ ను ఈ అవార్డు వరించింది. కెవీ సుబ్బా రెడ్డి తండ్రి కోట నారాయణ రెడ్డి ఏపీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్ గా పనిచేస్తూ జిల్లా స్థాయిలో ఉత్తమ డ్రైవర్ గా గుర్తింపు పొందారు. ఆయన కుమారుడు కెవీ సుబ్బా రెడ్డి కూడ పోలీస్ డిపార్ట్ మెంట్ లో గుర్తింపు పొందటం పట్ల ఈప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ సేవా అవార్డు పొందిన కెవీ సుబ్బా రెడ్డికి పలువురు అధికారులు తోటి ఉద్యోగులు, బంధు మిత్రులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

