వేసవిలో ఆరు బయట నిద్రించే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మల్లిఖార్జున రావు కోరారు. తాళ్లూరు మండలంలోని రామభద్రాపురంలో శనివారం రాత్రి ప్రజలకు ప్రాపర్టీ దొంగతనాలపై అవగాహన కల్పించారు. చిన్న పాటి నిర్లక్ష్యంతో ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన వస్తుందని చెప్పారు. రాత్రి వేళ ఇతర గ్రామాలకు బంధువుల నివాసాలకు వెళ్లవలసిన సమయంలో ఇంటికి తగిన రక్షణ ఏర్పాటు చేసుకోని వెళ్లాని లేదంటే స్థానిక పోలీసులకు తెలిపాలని కోరారు. కానిస్టేబుల్ మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.
