రీ సర్వేలో తప్పులు లేకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుని రైతులకు న్యాయం చెయ్యాలని జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి కోరారు. తాళ్లూరు సచివాలయంలో సోమవారం రీ సర్వే పై గ్రామ సభ నిర్వహించారు. రైతులు అప్రమత్తంగా ఉండి తమ భూ హక్కులను పరిరక్షించుకోవాలని ఎంపీడీఓ అజిత కోరారు. అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. మండల సర్వేయర్ మహేష్ బాబు, గ్రామ కార్యదర్శి షహనాజ్ బేగం, నాయకులు ఇడమకంటి సుబ్బా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
