జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహణ

జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా తాళ్లూరు, తూర్పుగంగవరం పీహెచ్సీల
పరధిలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. తాళ్లూరు పీహెసీ వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రతి ఫ్రై డే ను డ్రై డే గా పాటించాలని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, కూలర్లు వంటి వాటిలో నీటి నిల్వ లేకుండా చూడాలని కోరారు. డాక్టర్ రాజేష్ యాదవ్, నూపర్ వైజర్ పివీ రవి, ఎల్ టీ గోపాల క్రిష్ణ, ఫార్మాసిస్ట్ రమేష్, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తూర్పుగంగవరం పీహెచ్సీ పరధిలో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దోమల వలన డెంగ్యూ సోకుతుందని దోమల నివారణకు పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ప్రతిజ్ఞ చేసారు. పీహెచ్సీ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, హెచ్ ఈ ఓ కె సి ఎన్ బాబు, పీహెచ్ఎన్ రమణమ్మ, హెచ్ వి సుశీల, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *